S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/05/2019 - 17:48

చిత్తూరు: జనసేన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదనపల్లె టమాటా మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని అన్నారు. ఆంగ్లమాధ్యం కాదని రైతుల సమస్యలు పట్టించుకోండని హితవు పలికారు.

12/05/2019 - 05:30

తిరుపతి, డిసెంబర్ 4: అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ముందుచూపులేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం, ధరల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

12/05/2019 - 05:28

కర్నూలు, డిసెంబర్ 4: భారతీయ జనతా పార్టీతో తమ వైఖరి ఎలా ఉండబోతుందన్నది భవిష్యత్తులో తమ చేతలే చెబుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు నగరంలో బుధవారం జరిగిన పార్టీ సమీక్ష సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీతో స్నేహంగానే ఉండాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పడం ఆయన వ్యక్తిగతం అన్నారు.

12/05/2019 - 05:25

పోలవరం, డిసెంబర్ 4: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సీడబ్ల్యూసీ డైరెక్టర్ కమల్‌కుమార్ బుధవారం పరిశీలించారు. సీడబ్ల్యూసీ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించడానికి ఇక్కడకు వచ్చారు. జంట సొరంగాలు, రెగ్యులేటర్, గేట్ల తయారీ కేంద్రంతో పాటు స్పిల్‌వే, కాఫర్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

12/05/2019 - 05:23

అమరావతి, డిసెంబర్ 4: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలతో పాటు ఇతర శాఖల పరిధిలో ఉపాధి హామీ పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈ విషయమై బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/05/2019 - 05:02

అమరావతి, డిసెంబర్ 4: దేశంలోనే అత్యున్నత వైద్య విజ్ఞాన సంస్థగా శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (స్విమ్స్)ను తీర్చిదిద్దుతామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

12/05/2019 - 05:00

విజయవాడ, డిసెంబర్ 4: ఆంధ్రుల చరిత్ర, సంస్కృతికి ఆనవాళ్లైన చారిత్రక శిల్పాలను కాపాడి భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత అందరిపైనా ఉందని పురావస్తు పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.

12/05/2019 - 04:59

తిరుపతి, డిసెంబర్ 4: నేను బీజేపీకి ఎప్పుడు దూరమయ్యాను... ఎప్పుడూ దూరం కాలేదు... ప్రత్యేక హోదాకు సంబంధించి మాత్రమే బీజేపీకి దూరమయ్యాను. అది నా అవసరం కోసం కాదు.. ప్రజల కోసం అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన బుధవారం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు. గత నాలుగురోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటించానన్నారు.

12/05/2019 - 04:58

విజయవాడ (సిటీ), డిసెంబర్ 4: పవన్‌కళ్యాణ్‌కు మానసిక సమస్యలు వెంటాడుతున్నట్లుగా ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష ఎలా వేస్తారని పవన్‌కళ్యాణ్ ప్రశ్నించడం ఇందుకు నిదర్శనమని బుధవారం ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే ఆయన మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే ఉందన్నారు.

12/05/2019 - 04:58

విజయవాడ (సిటీ), డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఒకవైపు అమ్మఒడి పథకం అంటూనే మరోవైపు వైసీపీ బడులు నడుపుతున్నారని బుధవారం ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైకాపా జెండా ఎత్తమంటూ ముక్కుపచ్చలారని పిల్లలతో ఆటలు ఆడించారన్నారు.

Pages