ఆంధ్రప్రదేశ్‌

పెళ్లికి ‘కరోనా’ బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, మార్చి 22: ఒక పక్క కరోనా మహమ్మారికి అందరూ వణికిపోతుంటే పిఠాపురంలో ఓ కుటుంబం విదేశాల నుండి వచ్చిన వధూవరులకు వివాహం జరిపించడానికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అధికారులు రంగప్రవేశం చేయడంతో వారికి వైద్యపరీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న పిఠాపురం యువతికి, విజయవాడకు చెందిన వరునికి వివాహం నిశ్చయించారు. వధూవరులు ఇద్దరు ఐదు రోజుల క్రితం అమెరికా నుండి వచ్చారు. వధువు నివాసం పిఠాపురం పట్టణం కాగా, వరుడు విజయవాడ నుండి బంధువులతో కలిసి పిఠాపురం వచ్చాడు. ఆదివారం జరిగే వివాహ వేడుకకు కాకినాడలోని ఓ ఫంక్షన్ హాలు కూడా బుక్ చేశారు. వధూవరులిద్దరూ న్యూయార్క్ నుండి వచ్చిన విషయాన్ని స్థానికులు కొంతమంది అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఆదివారం వివాహం జరగాల్సివుంది. అయితే కాకినాడలోని ఫంక్షన్ హాలు యజమాని నిరాకరణతో ఇబ్బంది ఏర్పడింది. ఈలోగా స్థానికుల నుండి సమాచారం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి ఫిర్యాదుచేశారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావుతోపాటు, స్థానిక వైద్యాధికారి విజయ్‌శేఖర్ సంయుక్తంగా ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం పట్టణంలో వివాహం జరుగుతున్న ఇంటికి వెళ్లారు. పెళ్లి కుమార్తెకు, బంధువులకు పరీక్షలు నిర్వహించారు. అయితే విషయం తెలుసుకున్న పెళ్లి కుమారుడు అక్కడ నుండి వేరొక ప్రాంతానికి వెళ్లినట్టు చెబుతున్నారు. పెళ్లి కుమార్తెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక నిర్బంధపు గదిలో ఉంచారు. అవసరమైతే కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఐసొలేషన్ వార్డుకు తరలిస్తామని చెబుతున్నారు. వాస్తవానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే కరోనా వైరస్ ప్రభావం కనీసం 14 రోజుల నుండి 20 రోజుల మధ్యలో బయట పడుతుందన్న ఆందోళనతో వారి బంధువుల్లోనూ, స్థానికుల్లో వణుకు మొదలైంది. విందులో వారితో పాల్గొన్న వారితోపాటు, చట్టుపక్కల ప్రాంతాల వరకూ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా నుండి వచ్చిన వధువు ప్రభుత్వాసుపత్రిలో ఉండేందుకు నిరాకరించడంతో బలవంతంగా అధికారులు ఆమెను ఐసొలేషన్‌కు తరలించే ఏర్పాట్లుచేశారు.
*చిత్రం...వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు