ఆంధ్రప్రదేశ్‌

విదేశాల నుంచి వచ్చినవారు నిబంధనలు పాటించాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 22: విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్న వారిలోనే అధిక శాతం కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తున్నాయని, ఈ దృష్ట్యా ఎవరైనా విదేశాల నుండి వస్తే విధిగా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆదివారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ విదేశాల నుండి వచ్చినవారు వైద్య ఆరోగ్య శాఖకు కచ్చితంగా సమాచారం అందించాలన్నారు. ఈ విషయంలో వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. వైద్య ఆరోగ్య అధికారుల సూచనల మేరకు ఇంట్లో గానీ, హోం ఐసోలేషన్ నిబంధన పాటించాలని, అలాకాకుండా జనసంద్రంలో తిరగడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వస్తుందని హెచ్చరించారు. విదేశాల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చే వారు గోప్యత పాటించి సమాచారాన్ని దాచిపెట్టడం, వైద్య ఆరోగ్య సూచనలు పాటించకపోవడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై చర్యలకు సైతం వెనుకాడబోమన్నారు. విదేశాల నుండి వచ్చేవారు నిబంధనలు, సూచనలు పాటిస్తున్నారా, లేదా అనే అంశంపై సంబంధిత పోలీసులు దృష్టి సారిస్తారని చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నా తమవంతు సహకారాన్ని అందిస్తారని, సూచనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు.