S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/04/2019 - 05:25

గుంటూరు: ప్రస్తుతం నెలకొంటున్న పరిణామాలతో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని రాష్ట్ర హోం, విపత్తుల నివారణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. సంఘటన జరిగిన సమయంలో తీవ్రస్థాయిలో చర్చలు జరగడం, తరువాత విషయాన్ని మరచిపోవడం, శిక్షల ఖరారులో జాప్యం జరగడంతో నిందితుల్లో భయం తగ్గి ధీమాగా వ్యవహరిస్తుండటం ప్రమాదకరంగా మారిందని తెలిపారు.

12/04/2019 - 05:30

పోడూరు: తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడి, కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన ఉన్మాదికి బెయిలు రాకుండా చూడాలని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన కొవ్వూరి తేజస్విని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఆ ఉన్మాది బయటకు వస్తాడంటే నిద్రకూడా పట్టడంలేదని, కచ్చితంగా తనను ప్రాణాలతో బతకనీయడని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది.

12/04/2019 - 01:11

విజయవాడ: ఇసుక విధానం తరహాలో మట్టికి కూడా ఒక విధానం అమలు చేయాలని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయంలో గనులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో మంగళవారం మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు మట్టి దోపిడీ చేశారని ఆరోపించారు.

12/04/2019 - 01:09

అమరావతి: కేన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా పూర్తి స్థాయిలో అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమ కంటి కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. అధికారులకు పలు సూచనలు చేశారు.

12/04/2019 - 01:58

అమరావతి: న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించే ‘వైఎస్సార్ లా నేస్తం’ కార్యమ్రాన్ని మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ బటన్ స్విచాన్ చేసి అర్హులైన న్యాయవాదుల ఖాతాలో నగదు జమ చేశారు.

12/04/2019 - 01:03

అమరావతి, డిసెంబర్ 3: ప్రపంచ ప్రమాణాలను ఆధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విశాఖ నగరంలో రవాణా, తాగునీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్ట్‌లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

12/03/2019 - 14:18

కడప: షిర్డి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. కడప జిల్లా రైల్వేకోడూరు వద్దకు రాగానే పట్టాలు తప్పినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రైలును నిలిపవేశారు. వికలాంగుల బోగీ మాత్రమే పట్టాలు తప్పింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో అదికారులు ఊపిరి పీల్చుకున్నారు.

12/03/2019 - 05:43

విజయవాడ, డిసెంబర్ 2: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి ఆరవ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం అమలు తీరును పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిగా కే వెట్రిసెల్విని సోమవారం ప్రభుత్వం నియమించింది. షెడ్యూల్డ్ ఏరియాలో సర్వే, అసైన్‌మెంట్, కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆమె ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.

12/03/2019 - 05:42

గుంటూరు, డిసెంబర్ 2: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఏమని పిలవాలో అర్థంకాని విధంగా ఆయన తీరు ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు.

12/03/2019 - 05:40

విజయవాడ, డిసెంబర్ 2: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీపై పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన సన్న బియ్యం పంపిణీలో కీలకమైన రైసు మిల్లుల ఆధునీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అధునిక టెక్నాలజీగా భావించే సార్టెక్స్ విధానంలో ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు నిర్ణయించింది.

Pages