ఆంధ్రప్రదేశ్‌

సుప్రీం తీర్పుతో ఇళ్లస్థలాల పంపిణీపై కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ఎన్నికల వాయిదా ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ రద్దుతో రాష్ట్రంలో ఉగాది నాటికి దాదాపు 29లక్షల ఇళ్లపట్టాల పంపిణీకి భారీ కసరత్తు జరుగుతోంది. ఏవిధంగానైనా ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న సీఎం జగన్ కృతనిశ్చయంపై సుప్రీం తీర్పు పాలుపోసినట్లైంది. సాధ్యమైనచోట్ల ప్రభుత్వ స్థలాలు, సాధ్యం కానిచోట్ల ప్రైవేట్ స్థలాల కొనుగోలుకు ప్రభుత్వం ఇప్పటికే జిల్లాకు రూ. 5వేల కోట్లు విడుదల చేసింది. ముఖ్యంగా జగన్ ఎన్నికల ప్రణాళికలో పేదలందరికీ ఇళ్లు అనేది ఒక ప్రధానమైన అంశం. గతంలో దానికంటే భిన్నంగా ఐదేళ్ల తరువాత విక్రయించుకునే అధికారంతో తహశీల్దార్ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ పత్రాలను ఉగాది రోజున లబ్ధిదారులకు అందజేయనున్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆగమేఘాలపై భూమి కొనుగోలుదారులకు ప్లాట్‌ల అభివృద్ధి కోసం క్షణాల్లో రూ. 1400కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో కృష్ణాకు రూ. 450 కోట్లు, గుంటూరుకు రూ. 450 కోట్లు, తూ, ప గోదావరి జిల్లాలకు రూ.500 కోట్లు మంజూరయ్యాయి. ఏదిఏమైనా రాష్ట్రంలో తొలిసారిగా ప్రజల కళ్లలో ఉగాది వెలుగులను చూడబోతున్నాం. కలెక్టర్‌లు ఎక్కడికక్కడ పోటీగా పేదలకు ఇచ్చే స్థలాల్లో పార్కులు, అంతర్గత రహదార్లు, పాఠశాలలు ఏర్పాట్లు అన్నింటికి మించి ప్రతి ప్లాట్ లబ్ధిదారుకి ఇచ్చిన నంబర్‌ను వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాది రూపాయల వెంచర్లతో పోసిన లేఅవుట్లకన్నా అద్భుతంగా కనిపిస్తున్నాయి.