ఆంధ్రప్రదేశ్‌

ఏ క్షణంలోనైనా సచివాలయం తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 18: పాలనా రాజధాని విశాఖకు ఏ క్షణంలో అయినా తరలించే అవకాశం ఉందని, ఉద్యోగులు మానసికంగా సిద్ధం కావాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఈమేరకు సచివాలయంలో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. జూన్ నుంచి విద్యాసంస్థలు ప్రారంభించనున్నందున మే నెలాఖరులోగా సచివాలయ తరలింపు ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల తరలింపులో ఇంతకుముందు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిందని చెప్పారు. విశాఖలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలతో పాటు గృహ నిర్మాణానికి సహకరించాలని, ఇంకా పలు అంశాలను ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటిని పరిశీలించి నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తరలింపుపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలకు సూచనలు చేసింది. మే 31లోగా తరలిస్తే మంచిదని ఉద్యోగ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలో మరో సమావేశం నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామని వెంకట్రామిరెడ్డి విలేఖరులకు తెలిపారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రామిరెడ్డి