ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 19: రాష్ట్రంలో కొత్తగా రెండు దశల్లో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్ష నిర్వహించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలక చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇందుకోసం అత్యాధునిక
విధానాలను అమల్లోకి తెస్తామన్నారు. మత్స్యకారుల ప్రధాన వృత్తి చేపల వేటకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. ఫిషింగ్ హార్బర్లను పూర్తిచేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా 9చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని, రెండు విడతల్లో హార్బర్ల నిర్మాణం సుమారు రూ. 2901.61 కోట్లతో చేపడుతున్నట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఫేజ్-2, నెల్లూరు జిల్లా జువ్వలదినె్నలో మొదటి విడత కింద రూ. 1304 కోట్లతో ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతాయని వివరించారు. రెండో విడతగా రూ. 1597.61 కోట్లతో మరో ఐదుచోట్ల ప్రకాశం జిల్లా వాడరేవు, కొత్తపట్నం, శ్రీకాకుళం జిల్లా బూదగట్టపాలెం, ఎడ్డువానిపాలెం, విశాఖ జిల్లాలో ఫిషింగ్ హార్బర్లను ఆధునీకరిస్తామని తెలిపారు. మొత్తం 9చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు డీప్ సీ ఫిషింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మిగిలి ఉన్న భూసేకరణ సహా అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలన్నారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే ప్రాజెక్ట్‌ల కంటే పర్యావరణ హితమైన వాటిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు సూచించారు.

*చిత్రం...వౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం జగన్