ఆంధ్రప్రదేశ్‌

140 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: కరోనా వైరస్ వ్యాపించకుండా నగరాలు, పట్టణాల్లో పురపాలక శాఖ ద్వారా పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నామని పురపాలక శాఖ కమిషనర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ తెలిపారు. ఈమేరకు రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశామన్నారు. కరోనా వైరస్ నివారించడానికి ముందుజాగ్రత్తగా పురపాలక శాఖ తీసుకుంటున్న చర్యలతో కూడిన యాక్షన్ ప్లాన్‌ను గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో వివరించారు. ప్రపంచ ప్రజానీకానికి ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ నుండి రక్షణ పొందడానికి ఆ వ్యాధి వచ్చిన తరువాత చేయించుకునే చికిత్స కంటే ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం సూచిస్తున్న ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని, వ్యాధి రాకుండా నివారించడమే అత్యుత్తమైన మార్గమన్నారు. రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల కమిషనర్‌లతో ఈ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పలు సూచనలు చేసినట్లు తెలిపారు. మార్కెట్లు, రైతుబజార్లు, విద్యాలయాలు, పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి అంటువ్యాధులు క్రిములను నివారించే మందులను, బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్ తదితరాలను స్ప్రేయింగ్, ఫాగింగ్ చేస్తామన్నారు. 140 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఈ టీముల్లో ఆయా నగరాల స్థాయినిబట్టి 50మంది, 30మంది, 15మంది సభ్యులుంటారన్నారు. మాస్క్‌ల కోసం సంబంధిత సరఫరాదారులతో మాట్లాడటం జరిగిందని త్వరలో వస్తాయని తెలిపారు. సమావేశంలో పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, ఆశాజ్యోతి, తదితర అధికారులు పాల్గొన్నారు.