ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో షాపింగ్ మాల్స్ మూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీలో షాపింగ్ మాల్స్ మూసివేశారు. కరోనా ప్రభావంతో అక్కడ సినిమా హాల్స్‌ను సైతం మూసివేశారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు జాగ్రత్తలు పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అలాగే ఎన్టీయార్ వర్శిటీలో నోడల్ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 80 వెంటిలేషన్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలలో ల్యాబ్‌లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.