ఆంధ్రప్రదేశ్‌

అత్యవసర సేవలకు పాస్‌లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు పోలీసుల నుండి పాస్‌లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని, లాక్‌డౌన్ సమయంలో ప్రజల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలిపారు. అయితే నిత్యావసర సరుకుల రవాణాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో అత్యవసరంగా ప్రయాణించేందుకు ప్రజలకు పలు సమస్యలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రధానంగా వైద్యం, స్వచ్చంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే క్రమంలో ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు పోలీసుశాఖ నుండి అత్యవసర రవాణా పాస్‌లు మంజూరు చేసేందుకు ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ నుండి పాస్‌ల మంజూరుకు అన్ని చర్యలు తీసుకున్నామని, తగిన కారణాలు చూపి పాస్‌లు తీసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు వాట్సప్‌లు, మెయిల్స్ ద్వారా అత్యవసర పనులు ఉన్న ప్రజలు తమ సమాచారాన్ని పంపినట్లయితే పాస్‌లు మంజూరు చేస్తారని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు.