ఆంధ్రప్రదేశ్‌

కేరళ రాష్ట్రం తరహాలో ఏపీలోనూ కరోనా సహాయక చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: ఏపీలో కూడా కేరళ రాష్ట్రం తరహాలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని, ఈ ప్రమాదం మన ఆంధ్రప్రదేశ్‌కు కూడా వ్యాపించడం దురదృష్టకరమన్నారు. కరోనా వైరస్ ప్రజాజీవన స్థితిగతులను అల్లకల్లోలం చేస్తోందని, పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం ఉద్యోగ, ఉపాధి మార్గాలు, రోజువారీ కార్యక్రమాలకు కరోనా గండి కొట్టిందన్నారు. ఈనేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలకు అండగా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీతో ఐక్యంగా ముందుకు సాగేందుకు సిద్ధపడిందన్నారు. రూ. 20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి యుద్ధప్రాతిపదికన కరోనా సహాయక చర్యలకు ఉపక్రమించిందన్నారు. ఈ మొత్తాన్ని ఉచిత రేషన్, రుణ సహాయం సంక్షేమ పెన్షన్లు, రాయితీపై భోజనం, వైద్యసేవలు, ఉపాధి హామీ పథకం కోసం వెచ్చిస్తారని కేరళ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అవసరమైన కుటుంబాలకు రుణాలు ఇచ్చేందుకు రూ. 2వేల కోట్లను కేటాయించిందని, అందరికీ ఉచితంగా 10కేజీల బియ్యం, రూ. 20లకే భోజనం అందించేందుకు వెయ్యి హోటళ్లను తెరవనుందని రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.