ఆంధ్రప్రదేశ్‌

మీరు ఇంట్లో ఉండండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: మానవాళిని హరించేందుకు ముంచుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా చైతన్యవంతులైన జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 7నుండి రాత్రి 9గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే గడపాలని, తప్పనిసరై ఎవరైనా బయటకు రావాల్సివస్తే తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. శనివారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుండి డీజీపీ ఈమేరకు ఒక ప్రకటన
విడుదల చేశారు. ‘మీరు ఇంట్లో ఉండి కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు మద్దతు తెలిపితే మీకు రక్షణగా మేము బయట ఉంటా’మని ఆయన భరోసా ఇచ్చారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు పోలీసు సిబ్బంది స్టేషన్లలో అందుబాటులో ఉండేలా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ఇది స్వచ్ఛందంగా తమ కోసం తాము పాటించే కర్ఫ్యూగా భావించాలన్నారు. డయల్ 100 ద్వారా నిరంతరంగా, విస్తృతంగా సేవలు పొందాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ఒకే ప్రదేశంలో సుమారు 12గంటల పాటు జీవించి ఉంటుందని, జనతా కర్ఫ్యూ 14గంటలు పాటించడం ద్వారా వైరస్ జీవించి ఉన్న ప్రదేశాలను ఎవరూ స్పృశించరన్నారు. తద్వారా గొలుసును ఛేదించడమే ప్రధాని పిలుపులో ముఖ్య ఉద్దేశమని వివరించారు. రాష్ట్ర ప్రజలంతా జనతా కర్ఫ్యూని పాటించి మన సంకల్పాన్ని చాటిచెప్పాలని డీజీపీ సవాంగ్ కోరారు.
*చిత్రం... డీజీపీ గౌతమ్ సవాంగ్