ఆంధ్రప్రదేశ్‌

అకాలవర్షం దెబ్బతిన్న పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ/ఉయ్యాలవాడ, మార్చి 21: కర్నూలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. గాలి, వడగండ్ల వాన కురవడంతో ఆళ్లగడ్డ మండలం పడకండ్ల, పి.నాగిరెడ్డిపల్లె, జంబులదినె్న, బాచ్చాపురం, రుద్రవరం గ్రామాల్లో చేతికొచ్చే వరి, మొక్కజొన్న, కొర్రలు, మునగ, అరటి తోటలు నేలకొరిగింది. ఉయ్యాలవాడ మండలం వర్షానికి వరి, మినుపు, మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఉయ్యాలవాడలో వర్షానికి గడ్డం సరస్వతి ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంటిల్లిపాదీ ఆరుబయట నిద్రిస్తుండగా ఈ సంఘటన జరిగింది. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఆళ్లగడ్డ మండలం బత్తులూరు గ్రామంలో శుక్రవారం రాత్రి పిడుగు పడి వినయ్‌బాబు(27) మృతి చెందాడు. వర్షం కురిసే సమయంలో ఇంటిపైకప్పు గవాక్షం మూసేందుకు వెళ్లినప్పుడు పిడుగు మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.