ఆంధ్రప్రదేశ్‌

కరోనా వ్యాపించకుండా పటిష్ట చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని, దీనికి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శనివారం ఇక్కడ డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 142 శాంపిల్స్‌ను పంపగా వాటిలో 108 నెగెటివ్, 3 పాజిటివ్‌గా వచ్చాయని, మిగిలిన వారి ఫలితాలు రావాల్సి ఉందన్నారు. పాజిటివ్ వచ్చిన ముగ్గురు పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆ మూడు ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని, అయితే ప్రజలు పూర్తిగా సహకరించినప్పుడు మాత్రమే అది విజయవంతం అవుతుందన్నారు. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ప్రజలందరూ జనతా కర్ప్యూను పాటించాలన్నారు. అధికారులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది అందరూ వారి ఆరోగ్యాలను కూడా ఫణంగా పెట్టి నిరంతరం పనిచేస్తుండడం వల్లే మన రాష్ట్రంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించ గలుగుతున్నామన్నారు. వారికి గౌరవ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివారం సాయంత్రం 5గంటలకు అందరూ చప్పట్లు కొట్టి సెల్యూట్ చేద్దామని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి నాని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ కేసులు పెరిగితే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలి, ఇన్ పేషెంట్లు, ఔట్ పేషంట్లుతో ఎలా వ్యవహరించాలి, అంబులెన్స్‌లలో ఎలా చేరవేయాలి, తదితర విషయాలపై అవగాహన కోసం ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు సూచనలు జారీ చేశామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 3 ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని, మరో 2 ల్యాబ్స్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యాధి వ్యాప్తి నిరోధానికి ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారు, 10సంవత్సరాల లోపు పిల్లలు బయటకు రావద్దని ఆయన సూచించారు. కుటుంబ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ విజయరామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం... సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని