ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభ ఎన్నికలపై సస్పెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాజ్యసభ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణల గడువు పూర్తయింది. నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వణుకు పుట్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు స్వీయ నిర్బంధం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నెల 31వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో జనసంచారంపై నిషేధాజ్ఞలు కూడా విధిస్తున్నారు. జనం గుమికూడరాదని ప్రచారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలపై కరోనా ప్రభావం చూపనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగినప్పటికీ కరోనా ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల నిర్వహణపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేలతో
అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ఉంది. 23మందితో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. జనసేన పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనతో పాటు మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం పరోక్షంగా అధికార పార్టీకి మద్దతిస్తున్నారు. ఈ ప్రకారం రాజ్యసభ నాలుగు సీట్లు అధికార పార్టీకే దక్కుతాయి. అయితే తెలుగుదేశం తరపున పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఎన్నిక అనివార్యమైంది. ఆరోజున 175మంది ఎమ్మెల్యేలు విధిగా శాసనసభకు హాజరుకావాల్సి ఉంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే సచివాలయానికి సందర్శకులతో పాటు పనుల కోసం వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా అత్యవసరమైతే తప్ప సచివాలయానికి రాకపోకలు తగ్గించారు. రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచే సమీక్షిస్తున్నారు. వారంలో మంగళ, బుధ వారాలు మినహా ఆయన క్యాంప్ కార్యాలయానికే పరిమితమవుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సైతం ఉండవల్లి లేదా హైదరాబాద్‌లో తన నివాసానికే పరిమితమవుతున్నారు. ఎన్నికల సందర్భంగా 26న అసెంబ్లీకి 175మంది ఎమ్మెల్యేలు, పోలీస్, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేల అనుచరులు, అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు. కరోనా ప్రభావంతో అనుకోని పరిణామాలు ఎదురైతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా ప్రభావానికి సంబంధించిన నివేదికపై హెల్త్ బులెటిన్‌ను ఎన్నికల సంఘానికి కూడా పంపుతోంది. వీవీఐపీల ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశం కావటంతో ఎన్నికల సంఘం ఏరకంగా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణే మార్గంగా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దీంతో ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష నేతలకు సంబంధించి వ్యక్తిగత శ్రద్ద చూపాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల్లో పరిస్థితిని పర్యవేక్షించకుండా ఎన్నికలకు ఎలా హాజరవుతామని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొందరు వాదిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎన్నిక సందర్భంగా రెండురోజులు ఇక్కడే మకాం వేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. కరోనా ప్రభావంతో వివిధ రాష్ట్రాల్లో కూడా స్థానిక ఎన్నికలు వాయిదాపడ్డాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సైతం నిరవధిక వాయిదా వేశారు. దీంతో రాజ్యసభ ఎన్నికల నిర్వహణపై ఈసీ ఏరకంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.