S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/17/2020 - 06:20

హిందూపురం టౌన్, మార్చి 16: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి ఇటీవల విదేశాల నుంచి 30 మంది వరకు తిరిగి వచ్చారన్న వార్త కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో విదేశాల నుంచి ఎవరు వచ్చినా కరోనా సోకిందేమోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది.

03/17/2020 - 06:20

తిరుపతి, మార్చి 16: రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ప్రశాంతత ఉండదని, ఏదో ఒక రూపంలో ప్రజలను అశాంతికి గురిచేయడమే ఆయన నైజమని చంద్రగిరి ఎమ్మెల్యే చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం తిరుపతిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారన్నారు.

03/17/2020 - 01:00

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఆయన తనయుడు మధుసూదనరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబ సభ్యులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

03/17/2020 - 00:57

అమరావతి, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి, ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో అమరజీవి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

03/17/2020 - 00:53

అమరావతి, మార్చి 16: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాల ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన సోమవారం ముగిసింది. శాసనసభ ప్రాంగణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరిగిన నామినేషన్ల పరిశీలనకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ పరిశీలకులుగా వ్యవహరించారు.

03/17/2020 - 00:50

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉన్నందున ఎన్నికల వాయిదా నోటిఫికేషన్‌ను తక్షణం విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. కరోనా వ్యాప్తి లేదని, రాష్టవ్య్రాప్తంగా ముందస్తుగా

03/17/2020 - 00:12

విజయవాడ (సిటీ), మార్చి 16: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆరువారాలు కాదు, 50వారాలు వాయిదా వేసినా ఫలితం ఒక్కటే అంటూ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘బాబూ..

03/17/2020 - 01:39

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్థంతరంగా వాయిదా వేయటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. 40నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. అయితే చర్చల వివరాలేవీ అధికారికంగా వెలువడలేదు.

03/16/2020 - 13:41

విజయవాడ: స్థానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో గవర్నర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ అయ్యారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో దాదాపు నలభై ఐదు నిమిషాల సేపు భేటీ అయిన తరువాత ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. గవర్నర్‌తో భేటీ అయిన తరువాత ఇరువురు మధ్య వచ్చిన చర్చల అంశాలను ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన ఎన్నికల అధికారులతో చర్చిస్తున్నారు.

03/16/2020 - 06:31

విజయవాడ, మార్చి 15: ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరుగుతున్నారు. తొమ్మిది మాసాల పాలనలో ఏనాడూ ఇలాంటి చేదుఅనుభవం తనకు ఎదురుకాకపోవడంతో దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నికల కమిషనర్ ప్రకటన వెలువడిన మరుక్షణమే జగన్ హుటాహుటిన ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

Pages