ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌తో ఎస్‌ఇసీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: స్థానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో గవర్నర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ అయ్యారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో దాదాపు నలభై ఐదు నిమిషాల సేపు భేటీ అయిన తరువాత ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. గవర్నర్‌తో భేటీ అయిన తరువాత ఇరువురు మధ్య వచ్చిన చర్చల అంశాలను ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన ఎన్నికల అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం ఆయన చర్చకు వచ్చిన అంశాలపై మీడియాకు వివరించనున్నారు. ఇదిలావుండగా ఏపీలో స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వాయిదా వేయటంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం విదితమే. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు సైతం ఎన్నికల కమిషనర్ చర్యపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఫిర్యాదు సైతం చేయటం జరిగింది.