ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉన్నందున ఎన్నికల వాయిదా నోటిఫికేషన్‌ను తక్షణం విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. కరోనా వ్యాప్తి లేదని, రాష్టవ్య్రాప్తంగా ముందస్తుగా
ఏవిధమైన నివారణ చర్యలు చేపట్టిందీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అందజేసిన లేఖ ప్రతిని కూడా సీఎస్ తన లేఖకు జతచేశారు. కరోనా వైరస్ సాకుతో ఆరు వారాలు ఎన్నికలు వాయిదా వేయటం సరికాదన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్స్‌ల సమీకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందని, కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని లేఖలో తెలిపారు. వాయిదా నిర్ణయానికి ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఉంటే కరోనాపై వాస్తవ నివేదికను అందించి ఉండేవారమన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికునికి స్క్రీనింగ్ చేసి ఇంటింటికీ వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాలు కీలకపాత్ర పోషిస్తాయని, ముందుగా ప్రకటితమైన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నీలం సాహ్ని లేఖలో కోరారు.