ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ గూటికి గాదె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఆయన తనయుడు మధుసూదనరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబ సభ్యులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గాదె వెంకటరెడ్డి, ఆయన తనయునితో పాటు శిద్దా హనుమంతరావు, ప్రకాశం జిల్లాకు చెందిన మరో నేత సూర్యప్రకాశ్‌రావు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ వారికి వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో దురదృష్టవశాత్తూ వైఎస్‌కు దూరమయ్యానని, ప్రత్యేక పరిస్థితుల వల్ల యడబాటు ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమను నమ్మించి పార్టీలో చేర్చుకుని వంచించారని ఆయన విమర్శించారు. అడుగడుగునా అవమానపరిచినా భరించామని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకంగా తమను మోసం చేసిన ఆ పార్టీలో ఇక మనుగడ అసాధ్యమని భావించి వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌కు మొదటి నుంచి మద్దతిస్తున్నామని, రాష్ట్భ్రావృద్ధికి ఆయన చేస్తున్న కృషిలో తాము కూడా భాగస్వాములం
అవుతామని తెలిపారు. గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ 9నెలల్లోనే అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఇక జీవితాంతం వైసీపీకి అంకితభావంతో పనిచేస్తామని, తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. శిద్దా హనుమంతరావు, సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ జగన్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి జగన్ రాజీ పడకుండా పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. పార్టీలో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని వారు వివరించారు.
*చిత్రం... -మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం జగన్