ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికలు జరిగినా బాబు అడ్రస్ గల్లంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), మార్చి 16: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆరువారాలు కాదు, 50వారాలు వాయిదా వేసినా ఫలితం ఒక్కటే అంటూ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘బాబూ.. ఆరువారాలు కాదు, 60వారాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు’ అని ధ్వజమెత్తారు. వ్యవస్థల్లో నీ మునుషులున్నా
రు కదాని ఎలక్షన్లు నిలిపి వేయించావ్.. అని ఆరోపించారు. 5వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా చేసి 5కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశారన్నారు. నీ నీచరాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్.. అంటూ కామెంట్ చేశారు.
రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దా?
ఉగ్రవాద సంస్థలు వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు కోవర్టులు, స్లీపర్ సెల్స్‌ను సమాజంలో ప్రవేశపెడతాయని, ప్రజాసంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాల్సిన చోట ఇలా ద్రోహులను జొప్పించడం, సమయం చూసి వారు విధ్వంసానికి దిగడం టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా.. అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది కూడా అదేనన్నారు. చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి వీల్లేదని వ్యవస్థలోకి ఆయన జొప్పించిన స్లీపర్ సెల్స్ కరాఖండీగా చెబుతున్నాయని విమర్శించారు. దేశం కంటే కులమే గొప్పదని, తమ దేవుడు చంద్రబాబు అంతకంటే గొప్పవాడని, ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రాకపోతే మాకేంటని ఈ నిద్రాణ శక్తులు అంటున్నాయంటూ ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి మండిపడ్డారు.