ఆంధ్రప్రదేశ్‌

హిందూపురంలో కరోనా కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, మార్చి 16: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి ఇటీవల విదేశాల నుంచి 30 మంది వరకు తిరిగి వచ్చారన్న వార్త కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువగా ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో విదేశాల నుంచి ఎవరు వచ్చినా కరోనా సోకిందేమోనన్న భయాందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో హిందూపురం పట్టణంలో ముందస్తు చర్యల్లో భాగంగా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న వారు ఇటీవల హిందూపురం తిరిగి వచ్చినట్లు సర్వేలో తేలింది. అలా విదేశాల నుండి తిరిగి వచ్చిన 30 మందిని సర్వేలో గుర్తించినట్లు సమాచారం. దీంతో వెంటనే వైద్యఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచన మేరకు అలా గుర్తించిన 30 మందిని గృహ నిర్బంధం చేశారు. వారికి ఇళ్లలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరందరికీ కరోనా వ్యాధికి సంబంధించిన సమగ్రమైన వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని బంధువులకు దూరంగా ఉంచినట్లు సమాచారం. విదేశాల నుంచి 30 మంది హిందూపురం చేరుకున్నారన్న సమాచారం స్థానికంగా కలకలం రేపింది. వీరందరినీ గృహనిర్బంధంలో ఉంచి వైద్యసేవలు అందిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.