ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు సంతోషంగా ఉంటే బాబుకు ప్రశాంతత ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 16: రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ప్రశాంతత ఉండదని, ఏదో ఒక రూపంలో ప్రజలను అశాంతికి గురిచేయడమే ఆయన నైజమని చంద్రగిరి ఎమ్మెల్యే చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం తిరుపతిలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్ అంటే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అన్నారు. అందుకే ప్రజల్లో ఎన్నికల కమిషన్ అంటే గౌరవం ఉంటుందన్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికల కమిషనర్ హోదాలో ఆ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించారన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా వర్తించిన జ్యుడీషియల్ అధికారాలను దుర్వినియోగం చేశారన్నారు. ఎన్నికలను ఆరువారాల పాటు కాదు కదా ఆరునెలల పాటు వాయిదా వేసినా ప్రజలకు జగన్‌పై ఉన్న అభిమానం తగ్గదన్నారు.