ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభకు 5 నామినేషన్లూ ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాల ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన సోమవారం ముగిసింది. శాసనసభ ప్రాంగణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరిగిన నామినేషన్ల పరిశీలనకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ పరిశీలకులుగా వ్యవహరించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగుదేశం ప్రతినిధిగా పార్టీ అభ్యర్థి వర్ల రామయ్య పరిశీలన కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికలు జరిగే నాలుగు స్థానాలకు మొత్తం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వీరి లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, తెలుగుదేశం అభ్యర్థిగా వర్ల రామయ్య ఉన్నారు. ఐదుగురి నామినేషన్లను పరిశీలించిన అనంతరం సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్ అధికారి పీ బాలకృష్ణమాచార్యులు ప్రకటించారు. ఈ నెల 18 మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా, అదేరోజు ఎన్నికకు
సంబంధించి నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు లాంఛనప్రాయం అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నందున ఏకగ్రీవానికి బ్రేక్ పడింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ నెల 26న అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎన్నిక నిర్వహిస్తారు.

*చిత్రం... రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్, అభ్యర్థుల సమక్షంలో రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు పరిశీలిస్తున్న దృశ్యం