ఆంధ్రప్రదేశ్‌

అమరజీవి ఆశయాలు ఆదర్శప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 16: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి, ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో అమరజీవి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, ప్రభు త్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులు పా ల్గొన్నారు. సీఎం జగన్ ట్విట్టర్‌లోనూ తన సందేశం పోస్ట్ చేశారు. పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. తెలుగువారి మదిలో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడన్నారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో తెలుగు భాష, తెలుగువారి ఖ్యాతిని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతించారు.
*చిత్రం... అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న సీఎం జగన్