ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబువి నీచ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 16: చంద్రబాబు నాయుడువి నీచ రాజకీయాలని మరోమారు స్పష్టమైందని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాబు ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులపై రుసరుసలాడి, కేంద్ర ఎన్నికల సంఘం అధికారిని కూడా అంతుచూస్తానని బెదిరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్ష నేతగా మరోలా మాట్లాడటం బాబుకే సాధ్యమన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు ఎన్నికల కమిషనర్ లొంగినట్లుగా ఉందని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేస్తారని ఓ వర్గం మీడియాకు ముందుగానే ఎలా తెలుసని మంత్రి ప్రశ్నించారు. కరోనా గురించి తెలిసిన చంద్రబాబు తమ నాయకులతో ఊరేగింపుల మధ్య నామినేషన్లు ఎలా వేయించారో చెప్పాలన్నారు. రాజధానిలోని ఐదు గ్రామాల్లో చంద్రబాబు సామూహిక ధర్నాలు ఎలా నడిపిస్తున్నారో వివరించాలన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఎందుకు మాస్క్‌లు కట్టుకోవడం లేదని, వ్యాధి అంతగా ప్రబలితే టీడీపీ నేతలు మాస్క్‌లు ఎందుకు ధరించడం లేదన్నారు. ఎన్నికల అధికారి ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఎందుకు ప్రశ్నించమన్నారు. విచక్షణాధికారాలను సక్రమంగా ఉపయోగిస్తే విమర్శలు రావని, వ్యవస్థలను ధ్వంసం చేయాలని నిమ్మగడ్డ అనుకుంటే విలువ ఇవ్వబోమన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభించి ఉంటే సీఎస్, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యాధికారులను పిలిపించి ఎన్నికల అధికారి సమీక్షించి ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మీకు చెప్పారా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనలపై ఆనాడు ఎన్నికల అధికారిగా ఎందుకు ప్రశ్నించలేదని, సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీయడానికే కుట్రలు పన్నుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు గత ఐదేళ్లలో చేసిన తప్పులను చర్చించేందుకు తాను సిద్ధమని మంత్రి పేర్ని సవాల్ విసిరారు.