S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/12/2020 - 06:50

అమరావతి: కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ గిరి తమ అనుచరులతో వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

03/11/2020 - 07:35

అమరావతి, మార్చి 10: ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అవినీతిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కార్మికుల ఆరోగ్య ప్రమాణాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.

03/11/2020 - 07:35

విజయవాడ, మార్చి 10: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలో ఓటు హక్కును పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉండగా గవర్నర్‌తోపాటు ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ సైతం ఓటరుగా నమోదు అయ్యేందుకు అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు.

03/11/2020 - 07:31

అమరావతి, మార్చి 10: తెలుగుదేశం పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత 34 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నా సరైన గుర్తింపు లేదన్నారు.

03/11/2020 - 07:30

జమ్మలమడుగు, మార్చి 10: కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ సీనియర్ నేత వద్ద నెరిపిన రాజకీయ మంత్రాంగంతో పార్టీలో చేరికకు అధిష్టానం నుండి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.

03/11/2020 - 07:10

తాడిపత్రి, మార్చి 10: ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి తాను భయపడటం లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్ అంటే భయం లేదని, అయితే చట్టాలను చూసి భయపడుతున్నానన్నారు. వైకాపా ఆగడాలను ఎంతకాలం భరించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారన్నారు.

03/11/2020 - 07:08

విశాఖపట్నం, మార్చి 10: విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఎలాగైనా మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. జీవీఎంసీలో గెలవడం ద్వారా రాజధానిని వ్యతిరేకిస్తున్న విపక్షాలకు సరైన జవాబివ్వాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. ఎన్నికల ప్రకటన వెలువడేంత వరకూ స్తబ్ధతగా ఉన్న వైసీపీ ఒక్కసారిగా దూకుడు పెంచింది.

03/11/2020 - 07:07

అమరావతి, మార్చి 10: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తనా నియమావళి) అమల్లో ఉన్న దృష్ట్యా రాష్టఖ్రజానా ఖర్చుతో ప్రకటనలు, ఫొటోలు, సందేశాలు ప్రదర్శించటం, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించటంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. నాయకుల విగ్రహాలకు (కవర్ చేయటం) ముసుగు వేయటం తప్పనిసరన్నారు.

03/11/2020 - 07:06

అమరావతి, మార్చి 10: స్థానిక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకునే చర్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ సురేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

03/11/2020 - 07:06

విజయవాడ, మార్చి 10: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఓ వైపు ఏర్పాట్లు చేసుకుంటున్న అధికారులు మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా దృష్టి సారించారు. వారం రోజుల వ్యవధిలో ఆ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఈసీ 60 గుర్తులను విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులు వేర్వేరుగా ఉన్నాయి. ఎన్నికల బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు కనిపించదు.

Pages