ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీ ఎన్నికలకు 60 గుర్తులు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఓ వైపు ఏర్పాట్లు చేసుకుంటున్న అధికారులు మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా దృష్టి సారించారు. వారం రోజుల వ్యవధిలో ఆ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఈసీ 60 గుర్తులను విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తులు వేర్వేరుగా ఉన్నాయి. ఎన్నికల బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు కనిపించదు. కేవలం గుర్తును మాత్రమే ముద్రిస్తారు. పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం పోలింగ్ కేంద్రం సంఖ్య, అభ్యర్థి పేరు, దానికెదురుగా కేటాయించిన గుర్తును బోర్డుపై ముద్రిస్తారు. ఓటర్లు అభ్యర్థుల గుర్తులను బ్యాలెట్ పత్రంపై గుర్తించి తమకు నచ్చిన వారికి ఓటేయవచ్చు. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక పార్టీ రహితంగా జరుగుతుంది. కనుక పార్టీల గుర్తులు కేటాయించే అవకాశం ఉండదు. అందుకే ఎన్నికల సంఘం 60 గుర్తులను కేటాయించింది. ఆ గుర్తులు ఇలా ఉన్నాయి. బీరువా, ఎయిర్‌కండీషనర్, గాలిబుడగ, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాట్స్‌మెన్, బ్యాటరీ లైట్, బెల్ట్, నల్లబోర్డు, సీసా, బ్రెడ్, పెట్టె, బ్రష్, బకెట్, కేకు, కప్పుసాసర్, కటింగ్ ప్లేయర్, కత్తి, డీజిల్‌పంపు, డిష్‌యాంటినా, పల్లకి, విద్యుత్ స్తంభం, కవరు, ఫ్లూటు, గౌను, మూకుడు, గరాటా, గ్యాస్ సిలిండర్, గ్యాస్‌పొయ్యి, ద్రాక్షపండ్లు, హార్మోనియం, హెల్మెట్, హాకీస్టిక్ బంతి, ఐస్‌క్రీం, పోస్టుడబ్బా, మిక్సి, నెయిల్‌కట్టర్, నెక్‌టై, పెన్‌స్టాండ్, పెన్సిల్ షార్పనర్, కుండ, ప్రెషర్‌కుక్కర్, రేజర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రంపం, స్కూల్‌బ్యాగు, కత్తెర, కుట్టుమిషన్. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల గుర్తులు విడుదల కావడంతో ఇక ముద్రణ మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నది స్పష్టత వస్తుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారో, వారి పేర్లు ప్రకారం గుర్తులు కేటాయించారు.