ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ గూటికి రామసుబ్బారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ గిరి తమ అనుచరులతో వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము స్వచ్ఛందంగానే పార్టీలో చేరామని, ఎవరూ తమను బెదిరించలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాల కాలంగా సేవలందించామని, అయినా నాయకత్వంపై నమ్మకం లేని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. సీఎం జగన్‌కు ప్రజాదరణ ఉందని ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల స్పందన ఉందన్నారు. మద్య నిషేధం, జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును ప్రజలు విశ్వసించటం లేదని, లోపాలు తెలుసుకోకుండా వైసీపీపై బురద జల్లటం మంచి పద్ధతి కాదన్నారు. రామసుబ్బారెడ్డి లాంటి నాయకులు వైసీపీలో చేరటం శుభ పరిణామమన్నారు.

*చిత్రం... సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డి