ఆంధ్రప్రదేశ్
స్వాగతిస్తారో.. పలాయనమంటారో తేల్చుకోవాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమరావతి, మార్చి 10: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ప్రవర్తనా నియమావళి) అమల్లో ఉన్న దృష్ట్యా రాష్టఖ్రజానా ఖర్చుతో ప్రకటనలు, ఫొటోలు, సందేశాలు ప్రదర్శించటం, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించటంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. నాయకుల విగ్రహాలకు (కవర్ చేయటం) ముసుగు వేయటం తప్పనిసరన్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా, ప్రభుత్వ భవనాలపై బహిరంగ ప్రదర్శనలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 7 నుండి కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళి, న్యాయమైన, సమతుల్యమైన, నిష్పాక్షిక రీతిలో అమలు చేస్తామన్నారు. ఎన్నికలు నిర్వహించే కాలంలో ప్రభుత్వ వ్యయంతో విగ్రహాలు, ఛాయాచిత్రాలు, సందేశాలను ప్రదర్శించేందుకు వీలు లేదన్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో లభించే మంత్రులు, రాజకీయ నాయకులు, పార్టీలకు సంబంధించిన అన్ని ఛాయా చిత్రాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. ప్రక్షాళనలో భాగంగా వాటిని తొలగిస్తామన్నారు. అన్ని రాజకీయ నాయకుల ఛాయాచిత్రాలు రాష్ట్ర విభాగాల అధికారిక వెబ్‌సైట్ల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అదేవిధంగా అన్ని హోర్డింగ్‌లు, ప్రకటనలు, ప్రభుత్వ నిధులతో రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల విజయాలు సాధించటానికి అనుకూలంగా ప్రభావం చూపే వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా జీవితంలో చురుగ్గా ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర రాజకీయ నేతల ఛాయాచిత్రాలు ప్రభుత్వ భవనాలు, ప్రాంగణాల్లో ప్రదర్శించటంపై నిషేధం ఉందని పునరుద్ఘాటించారు. ఈ సూచన జాతీయ నాయకులు, కవులు, గతంలోని ప్రముఖ చారిత్రక వ్యక్తుల చిత్రాలకు లేదా భారత రాష్టప్రతి, గవర్నర్ల చిత్రాలకు వర్తించదని వీటిని మామూలుగానే ప్రదర్శించుకోవచ్చని సూచించారు.
రాజకీయాల్లో ఇప్పటికీ చురుగ్గా ఉన్న నాయకుల విగ్రహాలను ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లయితే వాటిని వెంటనే తొలగించాలన్నారు. ప్రజా నిధులతో నిర్మించిన గత నాయకుల విగ్రహాలను కవర్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల కోడ్ అమలు చేసిన తరువాత ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో తయారయ్యే విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులపై రాజకీయ కార్యకర్తలు, నాయకుల ఛాయాచిత్రాలు, సందేహాలు, చిహ్నాలు ఉండరాదన్నారు. ఎన్నికల మార్గదర్శకాలు వెంటనే అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు.