ఆంధ్రప్రదేశ్‌

వైజాగ్‌లో పాగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 10: విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ ఎలాగైనా మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. జీవీఎంసీలో గెలవడం ద్వారా రాజధానిని వ్యతిరేకిస్తున్న విపక్షాలకు సరైన జవాబివ్వాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. ఎన్నికల ప్రకటన వెలువడేంత వరకూ స్తబ్ధతగా ఉన్న వైసీపీ ఒక్కసారిగా దూకుడు పెంచింది. విపక్ష పార్టీల్లో ఉన్న సీనియర్, కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ పైచేయి సాధించేయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేసి గత ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరిన పీ బాలరాజు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం అనంతరం స్తబ్ధతగా ఉండిపోయారు. విశాఖ ఏజెన్సీలో గిరిజన నేతగా పట్టున్న బాలరాజును స్థానిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా వాడుకోవాలని వైసీపీ నిర్ణయించింది. బాలరాజు కుమార్తె డాక్టర్ దర్శిని సహా పలువురు అనుచరులను వైసీపీలోకి ఆహ్వానించారు. అలాగే పీఆర్పీలో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన చింతలపూడి వెంకటరామయ్య గత ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరి పెందుర్తి నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు.
ఎన్నికల అనంతరం ఆయన జనసేనకు రాజీనామా చేయగా, ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ 2014 చివర్లో వైసీపీలో చేరిన తైనాల విజయకుమార్ 2019 ఎన్నికల చివరి వరకూ పార్టీలో నిబద్దతతో పనిచేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ప్రోద్బలంతో వైసీపీ నుంచి ఫిరాయించిన తైనాల విజయ్ కుమార్‌ను తాజాగా తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. ఇక మాజీ మంత్రి గంటాకు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మాన్ కూడా వైసీపీలో చేరిపోయారు. వీరితో పాటు జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చిన్నాచితక కేడర్‌ను పార్టీలోకి సాదరంగా తీసుకుంటున్నారు. జీవీఎంసీ ఎన్నికలే లక్ష్యంగా జరుగుతున్న ఈ రాజకీయ బదిలీలు వైసీపీ వ్యూహాత్మకంగా చేపట్టిందనే చెప్పాలి. ఉత్తరాంధ్ర ప్రజలెవరూ విశాఖను రాజధానిగా కోరుకోవట్లేదని ప్రచారం చేస్తున్న టీడీపీ, ఇతర పక్షాలకు జీవీఎంసీ సహా స్థానిక సంస్థల్లో ఘన విజయంతోనే సమాధానం చెప్పాలన్నది వైసీపీ ఉద్దేశం. ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించకూడదన్న టీడీపీ కుట్రగా ప్రచారం చేయడంలో ఇప్పటికే వైసీపీ పై చేయి సాధించింది. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో జీవీఎంసీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించింది. ఎమ్మెల్యేల సహకారం లేని నగరంలో మాజీ ఎమ్మెల్యేల చేరికతో బలోపేతం కావాలన్నది వ్యూహంగా భావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీవీఎంసీలో విజయం సాధించడం ద్వారా పాలనా రాజధానికి ప్రజల మద్దతు ఉందని నిరూపించడమే వైసీపీ లక్ష్యం.