ఆంధ్రప్రదేశ్‌

బాబు మోసకారి.. బాలయ్య అమాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 10: తెలుగుదేశం పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత 34 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్నా సరైన గుర్తింపు లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసగించటంలో దిట్ట అని ఆయన నమ్మక ద్రోహంతోనే నేతలు పార్టీని వీడుతున్నారని స్పష్టం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కనిగిరి నుంచి 12వేల మెజారిటీతో గెలిచిన తనను గత సార్వత్రిక ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేయించటం వల్ల పరాజయం చవి చూడాల్సి వచ్చిందన్నారు. అక్కడ పోటీచేసే మద్దిశెట్టి వేణు తనకు సోదరుడని చెప్పినా వినకుండా దగ్గుబాటి కుటుంబానికి మాకు విభేదాలు లేవా అని ప్రశ్నించి దర్శి నుంచి ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని లేదా కనిగిరి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగిస్తామని నమ్మించి మోసగించారని ఆరోపించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఇప్పటి వరకు వౌనం వహించినట్లు తెలిపారు. బాలయ్య అమాయకుడని ఆయన్ను కూడా చంద్రబాబు మోసగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ చంద్రబాబు నిజ స్వరూపంతో విసిగి వేసారిన కదిరి బాబూరావు పార్టీలో చేరారని ఆయనకు వైసీపీలో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధించ గలదన్నారు. వైసీపీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబు పూచిక పుల్లనే మహావృక్షంగా అనుమానించి అందరినీ పార్టీ నుంచి తరిమివేశారని గతంలో నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఉపేంద్ర వంటి వారినే దూరం చేశారని ఇప్పుడు కూడా సీనియర్లను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. భయపడుతూ రాజకీయాలు చేయటం వల్లే ఆయన ఉనికిని కోల్పోయారని స్పష్టం చేశారు. టీడీపీని ప్రజలు పాతాళంలోకి నెట్టివేశారని ఇక దాన్ని మోసే శక్తి కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. రాజకీయాలను భ్రష్టుపట్టించే నాయకత్వం కంటే ప్రజలతో మమేకమైన నాయకత్వమే మేలని భావించి వైసీపీలో చేరుతున్నారని తెలిపారు.