ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ను చూసి కాదు.. చట్టాలంటేనే భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, మార్చి 10: ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి తాను భయపడటం లేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్ అంటే భయం లేదని, అయితే చట్టాలను చూసి భయపడుతున్నానన్నారు. వైకాపా ఆగడాలను ఎంతకాలం భరించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారన్నారు. అందుకే వారు ఎన్నికల్లో పోటీ చేస్తామని స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఉందన్నారు. నవరత్నాలు తప్ప అభివృద్ది ఏమాత్రం జరగలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తాము ఎండగట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలే ప్రభుత్వ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను ఎంతవరకు ఆచరిస్తారో చూద్దామన్నారు. ఆ తరువాతే తమ నిర్ణయం ఉంటుందన్నారు.