ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్ దంపతులకు విజయవాడలో ఓటు హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 10: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడలో ఓటు హక్కును పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉండగా గవర్నర్‌తోపాటు ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ సైతం ఓటరుగా నమోదు అయ్యేందుకు అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సూచనల మేరకు నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్దార్ నాగమణి మంగళవారం గవర్నర్ దంపతులకు సంబంధించిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అప్పటి కప్పుడే వివరాలను సరి చేసుకున్న అధికారులు జిల్లా పాలనాధికారి ద్వారా రాష్ట్ర ప్రథమ పౌరునికి అతి త్వరలోనే ఓటరు కార్డును అందజేస్తామని తెలిపారు.
*చిత్రాలు.. ఓటు హక్కు పత్రాలు పూర్తి చేస్తున్న గవర్నర్ దంపతులు