ఆంధ్రప్రదేశ్‌

ఈఎస్‌ఐల్లో అవినీతిపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 10: ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అవినీతిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కార్మికుల ఆరోగ్య ప్రమాణాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అవినీతిపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. మందులు కొనుగోలు చేయాల్సిన నిధులతో కాస్మొటిక్స్ కొన్నారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ వ్యవస్థలో అవినీతిని ఏరి పారేయాలని ఆదేశించారు. అవినీతి వల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలన్నారు.
కొనుగోలు చేసే మందుల్లో జీఎంపీ ప్రమాణాలు ఉండాలన్నారు. ఈఎస్‌ఐ బిల్లులు కూడా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని సూచించారు. వైద్య సేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకున్నామని ఆ ప్రమాణాలు ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో కూడా కొనసాగించాలని ఆదేశించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి బోధనాసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని నర్సింగ్ కళాశాలను కూడా నెలకొల్పుతామని తెలిపారు. ఇప్పుడున్న బోధనాసుపత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నట్లు చెప్పారు. వీరి సేవలను కూడా ఈఎస్‌ఐ ఆసుపత్రులు వినియోగించుకునేలా చూడాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖతో అనుసంధానమై ఈఎస్‌ఐ ఆసుపత్రులను కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు. ఆసుపత్రుల్లో సేవల మెరుగు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని ఆ మేరకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాలుష్య నివారణపైనా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం బారిన పడకుండా చూసుకుంటే రాష్ట్రానికి మేలు చేసినట్లే అని ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
సముద్రంలోకి విచ్చలవిడిగా వ్యర్థాలను వదులుతున్నారని, దీనివల్ల పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుందని భావితరాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నివారణ ప్రమాణాలను డిస్‌ప్లే చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం వల్ల అందులో పనిచేసే కార్మికుల ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించాలన్నారు. ఎల్‌ఐసీ బీమా చెల్లింపు నిలిచిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఎన్నిసార్లు అడిగినా స్పందించటం లేదన్నారు. బీమా రూపంలో ఎల్‌ఐసీ బకాయిలు పడిన చెల్లింపుల కోసం ప్రధానికి లేఖ రాస్తామని సీఎం స్పష్టం చేశారు.

*చిత్రం...కార్మిక శాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి