ఆంధ్రప్రదేశ్‌

నామినేషన్లను అడ్డుకుంటే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 10: స్థానిక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకునే చర్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ సురేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించేందుకు కొందరు పర్యటిస్తున్నారనే సమాచారంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమోటోగా భావించి సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఆటంకాలు కల్పించినా, జన జీవనానికి అంతరాయం కలిగించినా ఎన్నికల కమిషన్ ఉపేక్షించదని స్పష్టం చేశారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నికల సమయంలో ఇబ్బందులు కలుగచేయటాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తామని మరోసారి హెచ్చరించారు.