ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ గూటికి రామసుబ్బారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, మార్చి 10: కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ సీనియర్ నేత వద్ద నెరిపిన రాజకీయ మంత్రాంగంతో పార్టీలో చేరికకు అధిష్టానం నుండి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి తన ముఖ్య అనుచరులు, వర్గీయులతో పార్టీ మార్పుపై ఇప్పటికే సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత రాజకీయ పరిస్థితుల ప్రభావం దృష్ట్యా పీఆర్ వర్గీయులు పార్టీ మారేందుకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదే సమయంలో వైసీపీ అధిష్టానం నుండి పిలుపు రావడంతో ముఖ్య అనుచరులతో కలిసి బుధవారం అమరావతి చేరుకోవడానికి ప్రయాణ సన్నాహాలు చేపట్టారు. 1983లో టీడీపీ ఆవిర్భావం నుండి జమ్మలమడుగులో శివారెడ్డితో మొదలు ఆయన కుటుంబం పార్టీలోనే కొనసాగుతూ వస్తోంది. రామసుబ్బారెడ్డి 1995, 99 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల తరువాత వైసీపీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరిన సమయంలోనే రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చొరవతో రామసుబ్బారెడ్డి పార్టీలోనే కొనసాగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విధేయుడుగా ఉన్న పీఆర్ హౌసింగ్, అటవీశాఖామాత్యులుగా, పార్టీ ఉపాధ్యక్షుడుగా, ఎమ్మెల్సీగా, శాసన మండలి విప్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూవచ్చారు. దీంతో పీఆర్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్నా ప్రచారం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించామని, పార్టీ మారే ఆలోచన ఉంటే ముందుగానే తెలుపుతామని పీఆర్ ఇటీవల మీడియాకు తెలిపారు. ఆయన ఆ ప్రకటన చేసినన రెండు రోజులకే వైసీపీ అధిష్టానం నుండి పిలుపు అందడంతో తన అనుచరగణంతో కలిసి అమరావతికి పయనమయ్యారు. మరోవైపు 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలోకి చేరారు. టీడీపీలో ఉన్న సీనియర్ నేత రామసుబ్బారెడ్డి కూడా వైసీపీ గూటికి చేరడం దాదాపుగా ఖరారయిన పరిస్థితుల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న జమ్మలమడుగులో ఆ పార్టీ పూర్తి గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే స్థితికి చేరిందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.