ఆంధ్రప్రదేశ్‌

పోలీసులే కిడ్నాప్‌లు చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 12: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు తమ పార్టీ అభ్యర్థులు కేంద్రాలకు వెళ్తుంటే వైసీపీ నేతలు నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీలు చేస్తున్నారని తాను గతంలో చెప్పిన మాటలు నేడు నిజమయ్యాయన్నారు.
తమ పార్టీ అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాలు, నోడ్యూస్ సర్ట్ఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 15 మండలాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారన్నారు. పోలీసులే కిడ్నాప్‌లకు పాల్పడేలా వ్యవహరించడం గతంలో తానెన్నడూ చూడలేదన్నారు. కొందరు పోలీసులు నామినేషన్లు వేయవద్దని, వేస్తే బైండోవర్ కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. ఇక, గతంలో జగన్ వైసీపీలో ఎవ్వరినీ చేర్చుకోబోమని చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగా నేడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.
వైసీపీలో చేరాలనుకున్న నేతలను ముందుగా రాజీనామా చేయించి తర్వాతనే వైసీపీలో చేర్చుకుంటామని గతంలో జగన్ చెప్పిన మాటలను చంద్రబాబు గుర్తుచేశారు. అవసరమైతే న్యాయం కోసం సుప్రీం కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాల వారు నామినేషన్లు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో అనేక మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేసన్లు దాఖలు చేయలేక పోయారన్నారు. రాష్టవ్య్రాప్తంగా 76చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పలు సంఘటనలో చోటుచేసుకున్నాయన్నారు. ప్రతిపక్ష నేతలు చేసే ఫిర్యాదులపై తక్షణపై స్పందించాలని కోరారు. భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ పోలీసులను ఆదేశించాలన్నారు. పులివెందుల, మాచర్ల, పుంగనూరు, మంత్రాలయం, తెల్లకూరు, కావేటినగర్, పుల్లంపేట స్థానాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను మళ్లీ విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.