ఆంధ్రప్రదేశ్‌

ఉద్యానవన పంటల సాగుకు కేంద్రం పూర్తి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 7: రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగుకు కేంద్రం పూర్తి సహకారం అందజేస్తుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. గుంటూరులోని స్పైసస్ బోర్డులో మిర్చియార్డు అధికారులు, రైతులు, వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు వ్యవసాయంలో లాభాలు గడించాలంటే ఉద్యానవన పంటల సాగు తప్పనిసరి అన్నారు. గుంటూరు జిల్లాలో 70 వేల హెక్టార్లలో మిర్చి పంట సాగవుతోందని, మిర్చి అధిక దిగుబడులకు రైతులు రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులపై మొగ్గు చూపాలన్నారు. మిర్చి నాణ్యతను రైతులు తెలుసుకునేందుకు పరీక్షలు అందుబాటులో తీసుకువస్తామన్నారు. మిర్చి పంటపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. మిర్చి సాగులో నూతన విధానాలపై కృషి, విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు శిక్షణ ఇచ్చేలా తగు చర్యలు చేపడతామన్నారు. మిర్చి రైతులు తమ పంటకు అత్యధిక లాభాలు రావాలంటే తదనుగుణంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ సమావేశంలో స్పైసస్ బోర్డు సభ్యులు నడింపల్లి సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, మిర్చి ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెలగపూడి సాంబశివరావు, స్పైసస్ బోర్డు డిప్యూటి డైరెక్టర్ మోహన్‌రావు, రైతులు పాల్గొన్నారు.