ఆంధ్రప్రదేశ్‌

బీసీల ద్రోహిగా మిగిలిన జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 7: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో బీసీల రిజర్వేషన్లు గణనీయంగా పడిపోయాయని, రానున్న కాలంలో బీసీల ద్రోహిగా జగన్ మిగిలిపోనున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో వ్యవస్థలన్నింటినీ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏనాడూ ఇంతటి గందరగోళ పరిస్థితి ఏర్పడిన దాఖలాలు లేవని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల, ప్రభుత్వ తీరు, వైసీపీ నేతల వ్యవహారశైలి తదితర అంశాలపై చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో బీసీల రిజర్వేషన్లు రాష్టవ్య్రాప్తంగా గణనీయంగా పడిపోయాయని, నెల్లూరు జిల్లాను తీసుకుంటే బీసీలకు కేవలం 10.49 శాతం రిజర్వేషనే్ల దక్కాయని పేర్కొన్నారు. ఈ జిల్లాలో 16 మండలాల్లో ఒక్క బీసీకి కూడా రిజర్వేషన్లు దక్కలేదని చట్టపరంగా, రాజ్యాంగపరంగా వచ్చిన రిజర్వేషన్లను ఎందుకు తగ్గించాల్సి వచ్చిందని జగన్‌ను ఆయన నిలదీశారు. గతంలో ఏనాడూ ఇంతటి గజిబిజిగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదని, రిజర్వేషన్లను ఇష్టానుసారం ప్రకటించారని విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో షెడ్యూల్, నోటిఫికేషన్‌ల విడుదల అనేది అత్యంత ప్రాధాన్యమైందని, ఈ రెండింటినీ ఒకేసారి ఇవ్వడం అర్థరహితమన్నారు. నిఘా యాప్‌కు ముఖ్యమంత్రికి ఏమిటి సంబంధమంటూ నిలదీశారు. ఎన్నికల ప్రకటన చేశాక నిఘా యాప్‌ను ఎలా ఆవిష్కరిస్తారంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ సూపర్ ఎలక్షన్ కమిషనర్‌లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పాత రంగులతో సంబంధం లేదని, మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అవుతాయని ఎన్నికల కమిషనర్ ఎలా చెప్తారంటూ ప్రశ్నించారు. ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని, ఎన్నికలపై నిఘా పెట్టేందుకు ప్రభుత్వానికి ఏమిటి సంబంధమంటూ నిలదీశారు. ఓ పక్క ముఖ్యమంత్రి జగన్ 90 శాతం స్థానాలు మనమే గెలవాలని మంత్రులను బెదిరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఈ తరహా బెదిరింపులు సరికాదని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చూసి మీకు ప్రజలు ఓటేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులను నడిరోడ్డుపైకి లాగారని, కర్నూలు జిల్లాలో పేదల భూముల్లో వైసీపీ నేతలు జెండాలు పాతారని, ప్రభుత్వ వేధింపుల వలన అనేక మంది ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
గ్రామాల్లో సైతం కేసుల పేరుతో బెదిరిస్తూ ప్రతిపక్ష నేతలపై బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇకపై మీ ఆటలు సాగనివ్వబోమని, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మద్యం దుకాణాల్లో నాసిరకం సరుకును సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. విశాఖలో ఏకంగా తన పైనే దాడులకు దిగిన వైసీపీ నేతలు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత చెలరేగిపోతారని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల పంచాయితీని జరగనీయబోమని వైసీపీ నేతలు చేసే ప్రతి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన వైసీపీ పెద్దలు ప్రభుత్వంలోకి వచ్చాక అందరినీ మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆదాయం గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోయిందని, అప్పులు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. కేవలం ఆస్తులను స్వాహా చేసేందుకే మాన్సాస్ ట్రస్ట్‌లో ప్రభుత్వం పెద్దలు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు