ఆంధ్రప్రదేశ్‌

మహిళలకు పెద్దపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 8: రాష్ట్రంలోని 16 నగరపాలక సంస్థలు, 103 మున్సిపాల్టీలకు ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించింది. నగరపాలక సంస్థల్లో మేయర్ పదవులకు సంబంధించి జనరల్ మహిళలకు-5, అన్ రిజర్వుడ్-3, ఎస్టీ జనరల్-1, ఎస్సీ జనరల్-1, బీసీ జనరల్-3, బీసీ మహిళకు-2 ఖరారు చేశారు. మేయర్ పదవికి రిజర్వేషన్ల ప్రకటించిన నగరపాలక సంస్థల్లో నెల్లూరు (ఎస్టీ జనరల్), ఒంగోలు - ఎస్సీ (మహిళ), చిత్తూరు - ఎస్సీ (జనరల్), శ్రీకాకుళం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లు బీసీ మహిళలకు రిజర్వ్ చేయగా.. కడప, కర్నూలు, విశాఖపట్నం బీసీ (జనరల్)కు కేటాయించారు. కాకినాడ, మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవులు మహిళలకు రిజర్వ్ చేశారు. అనంతపురం, గుంటూరు, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు అన్ రిజర్వుడ్‌గా ఖరారు చేశారు. కాగా 103 మున్సిపాల్టీలకు సంబంధించి అన్ రిజర్వుడ్-26, జనరల్ మహిళ-26, ఎస్టీ జనరల్-2, ఎస్టీ మహిళ-1, ఎస్సీ జనరల్-7, ఎస్సీ మహిళ-7, బీసీ జనరల్-17, బీసీ మహిళలకు-17 స్థానాలు రిజర్వ్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్లకు సంబంధించి కృష్ణా జిల్లాలో ఉయ్యూరు నగర పంచాయతీ - జనరల్, పెడన - బీసీ మహిళ, నందిగామ నగర పంచాయతీ - జనరల్ మహిళ, తిరువూరు నగర పంచాయతీ - ఎస్సీ జనరల్, కొండపల్లి - బీసీ జనరల్, జగ్గయ్యపేట - బీసీ జనరల్, నూజివీడు - జనరల్ మహిళ, గుడివాడ - జనరల్‌కు కేటాయించారు. గుంటూరు జిల్లాలో తెనాలి - జనరల్ మహిళ, వినుకొండ - బీసీ జనరల్, సత్తెనపల్లి - జనరల్ మహిళ, తాడేపల్లి - ఎస్సీ జనరల్, గురజాల నగర పంచాయతీ - జనరల్ మహిళ, దాచేపల్లి నగర పంచాయతీ - జనరల్ మహిళ, పొన్నూరు - ఎస్సీ మహిళ, రేపల్లె - ఎస్టీ మహిళ, మాచర్ల - బీసీ జనరల్, మంగళగిరి - బీసీ మహిళ, పిడుగురాళ్ల - జనరల్, నరసరావుపేట - జనరల్, బాపట్ల - జనరల్ మహిళ, చిలకలూరిపేట - జనరల్‌గా కేటాయించారు. ప్రకాశం జిల్లాలో చీరాల - జనరల్, కందుకూరు - జనరల్ మహిళ, మార్కాపురం - జనరల్, దర్శి నగర పంచాయతీ - జనరల్, అద్దంకి నగర పంచాయతీ - ఎస్సీ మహిళ, చీమకుర్తి నగర పంచాయతీ - బీసీ జనరల్, గిద్దలూరు నగర పంచాయతీ - బీసీ జనరల్, కనిగిరి నగర పంచాయతీ - బీసీ జనరల్‌కు ఖరారు చేశారు. నెల్లూరు జిల్లాలో కావలి - జనరల్ మహిళ, వెంకటగిరి - బీసీ మహిళ, నాయుడుపేట - ఎస్సీ జనరల్, ఆత్మకూరు - ఎస్టీ జనరల్, గూడూరు - జనరల్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ - బీసీ మహిళ, సూళ్లూరుపేట - జనరల్‌కు కేటాయించారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లె - జనరల్ మహిళ, పుంగనూరు - జనరల్, పలమనేరు - బీసీ మహిళ, నగరి - బీసీ జనరల్, శ్రీకాళహస్తి - ఎస్టీ జనరల్, పుత్తూరు - ఎస్సీ జనరల్, కుప్పం - జనరల్‌కు
ఖరారు చేశారు. కడప జిల్లాలో బద్వేల్ - జనరల్, మైదుకూరు - జనరల్, ప్రొద్దుటూరు - బీసీ జనరల్, పులివెందుల - బీసీ జనరల్, రాయచోటి - జనరల్, జమ్మలమడుగు - బీసీ మహిళ, రాజంపేట - జనరల్, యర్రగుంట్ల - జనరల్, కమలాపురం నగర పంచాయతీ - ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. కర్నూలు జిల్లాలో ఆదోని - బీసీ మహిళ, నందికొట్కూరు - జనరల్, నంద్యాల - జనరల్ మహిళ, ఎమ్మిగనూరు - బీసీ మహిళ, గూడూరు - ఎస్సీ జనరల్, ఆళ్లగడ్డ - జనరల్, ఆత్మకూరు నగర పంచాయతీ - జనరల్ మహిళ, డోన్ నగర పంచాయతీ - బీసీ జనరల్‌కు కేటాయించారు. అనంతపురం జిల్లాలో ధర్మవరం - బీసీ మహిళ, గుత్తి - జనరల్ మహిళ, గుంతకల్ - జనరల్ మహిళ, హిందూపురం - జనరల్, కదిరి - జనరల్ మహిళ, కళ్యాణదుర్గం - బీసీ మహిళ, రాయదుర్గం - బీసీ మహిళ, తాడిపత్రి - జనరల్, పుట్టపర్తి - జనరల్, మడకశిర నగర పంచాయతీ - ఎస్సీ జనరల్, పామిడి నగర పంచాయతీ - బీసీ జనరల్, పెనుకొండ నగర పంచాయతీ - జనరల్‌కు ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం - జనరల్ మహిళ, మండపేట - బీసీ మహిళ, పెద్దాపురం - బీసీ మహిళ, పిఠాపురం - జనరల్ మహిళ, రామచంద్రాపురం - జనరల్ మహిళ, సామర్లకోట - జనరల్ మహిళ, తుని - జనరల్ మహిళ, గొల్లప్రోలు నగర పంచాయతీ - జనరల్ మహిళ, ముమ్మిడివరం నగర పంచాయతీ - ఎస్సీ జనరల్, ఏలేశ్వరం నగర పంచాయతీ - బీసీ మహిళకు కేటాయించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం - బీసీ మహిళ, నరసాపురం - బీసీ మహిళ, పాలకొల్లు - జనరల్, తాడేపల్లిగూడెం - జనరల్ మహిళ, కొవ్వూరు - ఎస్సీ మహిళ, నిడదవోలు - జనరల్, తణుకు - జనరల్ మహిళ, ఆకివీడు నగర పంచాయతీ - బీసీ మహిళ, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ - జనరల్ మహిళకు ఖరారు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస - బీసీ మహిళ, ఇచ్ఛాపురం - జనరల్ మహిళ, పలాస - బీసీ జనరల్, పాలకొండ నగర పంచాయతీ - ఎస్సీ మహిళకు కేటాయించారు. విజయనగరం జిల్లాలో బొబ్బిలి - ఎస్సీ జనరల్, పార్వతీపురం - బీసీ మహిళ, సాలూరు - జనరల్ మహిళ, నెల్లిమర్ల నగర పంచాయతీ - ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం - ఎస్సీ మహిళ, యలమంచిలి - బీసీ మహిళకు కేటాయించారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందుల మున్సిపాల్టీ బీసీ జనరల్‌కు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీ జనరల్‌కు రిజర్వు అయింది. వీరిద్దరూ నివాసముంటున్న గుంటూరు జిల్లా తాడేపల్లి నగర పంచాయతీ - ఎస్సీ జనరల్‌కు ఖరారయింది. రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి రిజర్వేషన్లు ఖరారు చేశామని పురపాలక శాఖ కమిషనర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ విలేఖరులకు తెలిపారు. కార్పొరేషన్లలో 672 డివిజన్లు, మున్సిపాల్టీల్లో 2123 వార్డులకు కోర్టు తీర్పుననుసరించి రిజర్వేషన్లు ఖరారు చేశామన్నారు. 16 కార్పొరేషన్లకు గాను 13, 103 మున్సిపాల్టీలకు గాను 74 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 3 కార్పొరేషన్లు, 29 మున్సిపాల్టీలకు కోర్టు సమస్యల వల్ల ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన వివరించారు.