ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పనుల కార్యాచరణపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 8: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం పనుల కార్యాచరణపై మళ్లీ కసరత్తు మొదలైంది. పనుల ప్రణాళిక మొదటికొచ్చిన నేపథ్యంలో నిర్ణీత గడువుగా ప్రకటిస్తున్న రెండేళ్ల వ్యవధిలో పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వర్షాకాలం లోపు కాఫర్ డ్యామ్ పనులు ముందుకు కదిలే పరిస్థితి కన్పించడంలేదు. కేంద్రం నుండి నిధుల రీయింబర్స్‌మెంట్ లేకపోవడంతో పనులు అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఇటీవలే పోలవరం అథారిటీ బృందం రెండు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి వెళ్లింది. పనుల స్థితిగతులను తెలుసుకుని కొన్ని సూచనలు చేసింది. మరోవైపు కేంద్రం నుంచి కొన్ని స్పష్టమైన చర్యలు చేపడితే తప్ప రీయింబర్స్‌మెంట్ నిధులు వచ్చే అవకాశం కనిపించడంలేదు. తమ అనుమతి లేకుండా పోలవరం కాంట్రాక్టర్లను మార్చడాన్ని కూడా కేంద్రంగా తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది. అప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి అపనమ్మకం కలిగిందంటున్నారు. సీఎం రావడం, ప్రణాళికపై నిర్ధిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా ఈ నేపథ్యంలోనే జరిగిందంటున్నారు. పనుల్లో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్న క్రమంలోనే యాప్ కూడా రూపొందిస్తున్నట్టుగా వుంది.
పోలవరం కాఫర్ డ్యామ్, మెయిన్ డ్యామ్ పనులు వచ్చే జూన్‌లోగా పూర్తిచేయకపోతే మళ్లీ వానాకాలంలో పనులు జరిగే అవకాశం దు. ఈ పనులు పూర్తిచేయాలంటే ముందు పునరావాసం కల్పించాల్సివుంది. ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు ఇంకా రూ.33 వేల కోట్లు కావాల్సివుంది.
ఈ నేపథ్యంలోనే రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లక్ష్యం మేరకు పనులు ముందుకెళ్లే దాఖలాలు కనిపించడంలేదు. పునరావాసం పూర్తిచేయకుండా ప్రధాన పనులు పూర్తయ్యే పరిస్థితి కన్పించడంలేదు. పనుల్లో కదలిక రావాలంటే కొత్త అంచనాలు ఆమోదించడంతో పాటు కనీసం రీయింబర్స్‌మెంట్ నిధులైనా పూర్తిస్థాయిలో కేంద్రం ఇవ్వాల్సివుంది. పోలవరం ప్రాజెక్టుకు రెండోసారి సవరించిన అంచనాలు గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే వున్నాయి. జల వనరుల శాఖ సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తర్వాత కూడా కేంద్రం ఎస్టిమేట్‌ను ఆమోదించలేదు. అంచనాలకు సంబంధించి కొన్ని వివరాలు రాష్ట్రం నుంచి రాకపోవడం వల్లే అంచనాలు ఆమోదం పొందలేదని కేంద్రం చెబుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలిస్తే.. హెడ్ వర్క్సు ప్రత్యేకించి 58.50 శాతం పూర్తయింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ప్లాంక్ 1050 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తయింది. కాంక్రీటు పనులకు సంబంధించి 38.88 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటి వరకు 30.75 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. ఎగువ కాఫర్ డ్యామ్ 73.94 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సివుండగా ఇప్పటివరకు 38.12 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. దిగువ కాఫర్‌కు సంబంధించి 25.46 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సి వుండగా కేవలం 3.37 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే జరిగింది. వర్షాకాలం లోపు ఈ పని పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో వచ్చే ఏడాది వరకు కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఆగాల్సిందే. దీనికి అనుసంధానంగానే ప్రధాన డ్యామ్ పని కూడా ముడిపడివుంది. ఏదేమైనప్పటికీ నిర్ధేశిత ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయగలిగితేనే లక్ష్యం మేరకు పనులు ముందుకు కదిలే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
*చిత్రం...పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం