ఆంధ్రప్రదేశ్‌

మరో 25 ఏళ్లు జగనే సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 7: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరో 25 ఏళ్ళపాటు అధికారంలో ఉండాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలను గెలిపించుకోవాలని ఉత్తరాంధ్ర జోనల్ ఇన్‌చార్జి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ జగన్నాథ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. పార్టీ భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఆధారపడి ఉందని, రాష్ట్రంలో అందరికీ ఇళ్ళు, దిశ చట్టం వంటి వినూత్న కార్యక్రమాలతో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నడుం బిగించారన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా డబ్బు, మద్యం పంపిణీ కాకుండా సమర్ధవంతంగా స్థానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్డినెన్స్ తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకు ఆయా స్థానాలను కట్టబెట్టాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం దోపిడీ, అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో తొమ్మిది నెలల పాలనలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, జి.మాధవి, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, రాజన్నదొర, బొత్స అప్పలనర్సయ్య, చిరంజీవులు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.