ఆంధ్రప్రదేశ్‌

ముందు జాగ్రత్తతో కరోనాకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 9: ముందు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్‌ను దూరం చేయవచ్చని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణకు వివిధ రాష్ట్రాలు చేపట్టిన చర్యలపై సోమవారం ఢిల్లీ నుంచి ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 105 దేశాల్లో కరోనా వ్యాప్తి చెందిందని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తిని విధిగా విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర భూభాగ సరిహద్దు మార్గాల గుండా దేశంలోకి వచ్చే వారికి స్క్రీనింగ్ చేసి వైరస్ లక్షణాలు బయటపడితే వారిని కొంతకాలం పాటు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి తగిన వైద్య చికిత్సలు నిర్వహించాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాలను సన్నద్ధం చేసి వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని పునరుద్ఘాటించారు. కరోనా కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యల ద్వారానే చాలా వరకు వైరస్ వ్యాప్తి నియంత్రణకు అవకాశం ఉంటుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య సౌకర్యాలు కలిగిన శాఖలు, విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలన్నారు. వీలైనంత వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకేచోట చేరి సభలు, సమావేశాలు వంటి కార్యక్రమాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకునేలా నిర్వాహకులకు స్థానిక ప్రభుత్వాలు సూచించాలన్నారు. వైరస్‌పై చేయదగిన, చేయకూడని వాటిపై గ్రామ స్థాయిలో ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై చైతన్యం తేవాలన్నారు. ఇతర దేశాలతో భూ భాగం సరిహద్దులు గల రాష్ట్రాలు పూర్తి అప్రమత్తతతో ఉండి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు పూర్తి సమన్వయంతో పనిచేసేలా అవసరమైన ప్రాంతాల్లో క్వారంటైన్ సౌకర్యాలు కల్పించేందుకు వీలైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు తగిన ల్యాబ్‌లను దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్‌కు సంబంధించి అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న లక్షకు పైగా సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని వివరించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఇన్‌చార్జి కమిషనర్ వీ విజయ రామరాజు, ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్, డీఎంఈ డాక్టర్ వెంకటేశ్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం... కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ నీలం సాహ్ని