ఆంధ్రప్రదేశ్
వైసీపీ తీర్థం పుచ్చుకున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒంగోలు: ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీకి భారీ షాక్ తగిలింది. సినీనటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు టీడీపీని వీడారు. అమరావతిలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి భారీ కుదుపు తగిలిందనే చెప్పవచ్చు. 2014 సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 12వేల ఓట్ల మెజార్టీతో తెలుగుదేశంపార్టీ తరపున కదిరి బాబురావు గెలుపొందారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో 2019 ఎన్నికల్లో కదిరి బాబురావును అనూహ్యంగా దర్శి నియోజకవర్గానికి చంద్రబాబు మార్చగా కదిరి ఓటమి చెందారు. ఈ నేపధ్యంలో ఒంగోలు పార్లమెంట్‌తోపాటు, దర్శి, కనిగిరి నియోజకవర్గాలు మొత్తం వైసీపీ ఖాతాలో పడగా తెలుగుదేశంపార్టీ ఘోరపరాజయం పాలైంది. దర్శి నియోజకవర్గం నుండి కదిరి బాబురావు కాకుండా శిద్దా రాఘవరావు పోటీచేసి ఉన్నట్లయితే ఫలితాలు తారుమారయ్యేవని ఎన్నికల సమయంలో ప్రచారం సాగింది. ప్రస్తుతం దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న కదిరి బాబురావు వైసీపీ గూటికి చేరటంతో ఆ ఇన్‌చార్జి పదవికి ఖాళీ ఏర్పడింది. కాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కదిరి ప్రభావం కనిగిరి, దర్శి నియోజకవర్గాలపై పడే అవకాశాలున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువుగానే ఉన్నారు. ఈనేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కదిరివైపే మొగ్గుచూపుతురా లేక టీడీపీలోనే కొనసాగుతారా? అన్న చర్చ సాగుతోంది.
*చిత్రం...సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు