ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 10: వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వా నీ, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపా రు. పరిమళ్ నత్వానీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తారు. కాగా అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధినేత, ముఖ్యమం త్రి వైఎస్ జగన్ బీసీ వర్గాలకు పెద్దపీట వేశారు. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లకు ప్రాతినిధ్యం కల్పించటం ద్వారా 50 శాతం బీసీలకు రిజర్వేషన్ కేటాయించినట్లవుతుందని భావిస్తున్నారు. శాసనమండలి రద్దు తీర్మానం నేపథ్యంలో వీరిని రాజ్యసభ కు పంపాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా పారిశ్రామికవేత్త అయోధ్య రామిరెడ్డి ఆది నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు సైతం పార్టీని అంటిపెట్టుకుని నాటి అధికార పార్టీపై ఉద్యమించారు. దీంతో పాటు అంగ, అర్థబలం కలిగిన ఆయనకు సీటివ్వటం వల్ల పార్టీ ప్రతిష్ట పెరుగుతుందనేది సీఎం జగన్ భావన. కాగా రాజ్యసభ అభ్యర్థులు పరిమళ్ నత్వానీ, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు.
*చిత్రం...ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న రాజ్యసభ అభ్యర్థులు అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి, పరిమళ్ నత్వానీ