ఆంధ్రప్రదేశ్‌

టీడీపీకి సతీష్‌రెడ్డి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి, శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం కడప జిల్లా వేంపల్లెలోని స్వగృహంలో ముఖ్యఅనుచరులతో సమావేశమైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్దికి ఎంతో కష్టపడ్డానన్నారు. అయినా తనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు నమ్మకం లేదన్నారు. నమ్మకం లేనిచోట కొనసాగలేమన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్దంగా లేనన్నారు. అలాగే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆశించిన విధంగా అభ్యర్థులను కూడా నిలబెట్టలేనప్పుడు పులివెందుల నియోజకవర్గం ఇన్‌చార్జిగా పార్టీలో కొనసాగడం సబబు కాదన్నారు. అందుకే కార్యకర్తలకు క్షమాపణ చెబుతూ పార్టీ నుండి వైదొలుగుతున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనకు పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడుకు ఒకరిమీద ఒకరికి నమ్మకాలు సడలిపోయాయన్నారు. దీంతో ఇరువురి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరుతున్నారా? విలేఖరులు ప్రశ్నించగా భవిష్యత్ కార్యచరణపై అందరితో సంప్రదించాకే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈ సమావేశానికి పులివెందుల నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, టీడీపీ నాయకుడు రాంగోపాల్‌రెడ్డి, తూగుట్ల మధుసూదన్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ తొండూరు ఇన్‌చార్జి శివమోహన్‌రెడ్డి, చక్రాయపేట ఇన్‌చార్జి విశ్వరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ హేమాద్రి, వేముల నాయకులు పార్థసారథిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...వేంపల్లెలో మంగళవారం పార్టీ ముఖ్యఅనుచరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేత సతీష్‌రెడ్డి