ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరులో కరోనా కేసు నమోదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: నెల్లూరులో ఒక యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ సహా వైద్యాధికారులు ఎవరు కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతుండడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు నెల్లూరులో నమోదైందనే సమాచారం బుధవారం ఉదయం నుండి ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు జిల్లా వాసులకు నిద్రపట్టనివ్వడం లేదు. అధికారులెవరూ స్పష్టతనివ్వనప్పటికీ బుధవారం ఉదయం నుండి నగరంలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు కరోనా వైరస్ పాజిటివ్‌గా నివేదిక వచ్చిందనే భావన ప్రజల్లో కలిగిస్తోంది. తొలుత తిరుపతి స్విమ్స్‌లో ప్రాథమిక నివేదిక వచ్చిందని, అందులో ప్రాథమికంగా వ్యాధి లక్షణాలు కనిపించినట్లు సమాచారం. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి జిల్లా కలెక్టర్ అందుబాటులో ఉన్న వైద్యాధికారులు, సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆదేశాల మేరకు వైరస్ బారిన పడిన యువకుడు నగరంలో నివసించే 42,47 డివిజన్ల పరిధిలోని చిన్నబజార్, సంతపేట, గిడ్డంగి వీధి, మండపాల వీధి, కామాటివీధి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుండి ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఇతర వైద్య సిబ్బందితో ఉన్న బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వేలు చేస్తూ, ఇంట్లోని వారి అనారోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. బాధిత యువకుడి కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక వార్డుకు తరలించినట్లు సమాచారం. అయితే కరోనా వ్యాప్తిపై జిల్లా అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. రాష్టస్థ్రాయి అధికారులే ఈ విషయంలో ప్రకటన చేయాల్సి ఉంటుందనే ముక్తసరి సమాధానాన్ని కొందరు అధికారులు చెబుతున్నారు.
రంగనాథుడి రథోత్సవానికి బ్రేక్
కరోనా వైరస్ నగరంలోని యువకుడికి సోకిందనే వార్తల నేపథ్యంలో జిల్లా అధికారులు ఇతర ప్రాంతాలకు, వ్యక్తులకు ఈ వైరస్ సోకకుండా ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా వైరస్ సోకిన యువకుడు నివాసముండే చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం నగరంలోని రంగనాయకులపేటలో జరగాల్సిన శ్రీరంగనాథస్వామి రథోత్సవాన్ని జిల్లా కలెక్టర్ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో రథోత్సవ కార్యక్రమం పాక్షికంగా కొద్దిదూరం మాత్రమే కొనసాగింది. వేలసంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో కరోనా వ్యాప్తి కూడా అదేస్థాయిలో ఉంటుందని భావించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కరోనా వైరస్ సోకిన వ్యక్తికి చెందిన కుటుంబసభ్యులను దూరప్రాంతంలో ఉంచి చికిత్స అందించాలనే అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. నగరంలోని జనార్ధన్‌రెడ్డి కాలనీ సమీపంలో ఎన్‌టిఆర్ గృహకల్ప పేరుతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న ఇళ్లలో కరోనా వైరస్ బాధితులను ఉంచి చికిత్స అందించబోతున్నారనే సమాచారం నేపథ్యంలో సీపీఎం నేతలు బుధవారం ఆ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్య పీడితులను ప్రజల మధ్యన ఉంచి చికిత్స చేయాలని భావించడం సరికాదని, ఈ నిర్ణయాన్ని అధికారులు పునరాలోచించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి వరుస సంఘటనలను పరిశీలిస్తే అధికారులు కరోనా విషయంలో ప్రజలకు మరింత స్పష్టతనివ్వాలని జిల్లా వాసులు కోరుతున్నారు.