ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ నేతలపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచర్ల రూరల్, మార్చి 11: తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై బుధవారం గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో దాడి జరిగింది. మాచర్ల నియోజక వర్గంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్లు తీసుకోకుండా అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక టీడీపీ నాయకులు పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయటంతో ఆయన ఆదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాచర్లకు బయలుదేరారు. మాచర్ల మండల పరిధిలోని రాయవరం జంక్షన్ సమీపం నుండి వైయస్సార్‌సీపీ శ్రేణులు వారి వాహనాన్ని తరుముకుంటూ వెళ్ళి రింగ్‌రోడ్డు సమీపంలో రాగానే వైఎస్సార్‌సీపీ నాయకులు కారును అడ్డగించి కారు అద్దాలు ధ్వంసం చేయటంతో పాటు కర్రలతో లోపల ఉన్నవారిపై దాడి చేశారు. ఈ దాడిలో హైకోర్టు న్యాయవాది కిషోర్ తలకు తీవ్ర గాయాలు కాగా బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. తరువాత టీడీపీ నేతల కారు వెల్దుర్తికి చేరుకోగా అక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు దాడికి పూనుకోవటంతో గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు వారికి బందోబస్తు కల్పించి ఆ ప్రాంతం నుంచి కారంపూడి వైపు పంపించారు. సంఘటన గురించి తెలుసుకున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి కార్యకర్తలతో రోడ్డుపైకి రావటంతో పోలీసులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాస్తారోకోలు, ధర్నాలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడి జరిగిన విషయాన్ని బుద్దా వెంకన్న ఫోన్ ద్వారా చంద్రబాబునాయుడికి తెలియజేశారు. ఈ ఘటనతో మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీకు నామినేషన్‌ల ఘట్టం
చివరి రోజు కావటంతో పోలీసులు మండల పరిషత్ కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు నిర్వహించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గుంటూరు రేంజ్ ఐజీ
సంఘటన గురించి తెలుసుకున్న గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు, గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావు బుధవారం సాయంత్రం మాచర్ల పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని రింగ్‌రోడ్డు సెంటర్ ప్రాంతంలో దాడి జరిగిన సంఘటన గురించి గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు వివరించారు. పట్టణంలో శాంతిభద్రతల గురించి ఐజీ ఆరా తీశారు. ఐజీ ప్రభాకరరావువెంట పట్టణ, రూరల్ సీఐలు రాజేశ్వరరావు, భక్తవత్సలరెడ్డి, ఎస్సైలున్నారు.

*చిత్రాలు.. టీడీపీ నేతల కారుపై దాడి చేస్తున్న దృశ్యం,
* సంఘటనా స్థలంలో వివరాలు తెలుసుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు