ఆంధ్రప్రదేశ్‌

ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 11: ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య విభజన రేఖ చెదిరిపోతోందని, ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న సంఘటనలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని పీసీసీ ఛీఫ్ శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. హడావుడిగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. నామినేషన్లకు కేవలం 24 గంటల ముందు రిజర్వేషన్లు ప్రకటించడం దీనికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయంలో న్యాయస్థానం ఆదేశాలను తక్షణమే అమలు చేయాలన్నారు. ఒక వేళ సమయాభావం వల్ల భవనాలకు రంగులు మార్చని పక్షంలో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తున్నారని, భయపెట్టి ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ యత్నిస్తోందని అరోపించారు. రాజకీయ పార్టీల నాయకులపై ఉన్న పాతకేసులను బయటకు తీసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కొంతమంది అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో నమోదవుతున్న కేసులు, తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌కు చేస్తున్న ఫిర్యాదులు ఫిర్యాదులుగానే మిగిలిపోతున్నాయన్నారు. ఇక ముఖ్యమంత్రి స్వయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రానిపక్షంలో మంత్రులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా ఇవ్వాలంటూ హుకుం జారీ చేయడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీఏ నారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర రావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.