ఆంధ్రప్రదేశ్‌

శృతిమించిన వైసీపీ అరాచకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 11: రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తల అరాచకాలు, దాడులు శృతిమించుతున్నాయని, అసలు రాష్ట్రంలో పాలన ఉందా, లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాచర్లలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, న్యాయవాది కిషోర్‌లపై వైసీపీ నేతలు దాడికి పాల్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని తానెన్నడూ చూడలేదన్నారు. నామినేషన్లు వేసేందుకు బొందలవీడులో కుల ధ్రువీకరణ పత్రాలతో వెళితే వైసీపీ నేతలు పత్రాలను చించివేసినా, పోలీసులు స్పందించక పోవడంతో తమ పార్టీ తరపున నిజ నిర్ధారణ కమిటీగా బోండా ఉమా, బుద్దా వెంకన్న, న్యాయమూర్తి కిషోర్‌లను అక్కడికి పంపామన్నారు. అయితే మార్గమధ్యలోనే వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఇనుప రాడ్డుతో కారు అద్దాలు పగలకొట్టి దాడి చేయటం దారుణమన్నారు. దాడి దృశ్యాలను ప్రదర్శించారు. ఈ ఘటనలో న్యాయవాది కిషోర్ గాయపడ్డారన్నారు. వైసీపీ కార్యకర్తలు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఫోన్ల ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని చేరవేసుకుంటూ దాడులకు పాల్పడ్డారన్నారు. 30 మంది కారుపై దాడి చేశారని, ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక నాగార్జున సాగర్ డ్యామ్ మీదుగా దగ్గరలోని హాలియా, మల్లేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని తాను సూచించానన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, పోలీసులు కూడా టీడీపీ నేతలకు రక్షణ కల్పించలేని దుస్థితి నెలకొందన్నారు. కడప, పులివెందుల, చిత్తూరు, పుంగనూరుతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దౌర్జన్యాలు చేస్తున్నారని, కుల ధ్రువీకరణ పత్రాలు, నోడ్యూస్ సర్ట్ఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో పంచాయితీ కార్యాలయంలో కార్యదర్శులను బంధించి వైసీపీ కార్యకర్తలు తాళాలు వేయడంతో పాటు మొబైల్ ఫోన్లు కూడా తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చెప్పే మాటలు, చేసే పనులకు పొంతన లేకుండా ఉందని ధ్వజమెత్తారు. మాచర్లలో జరిగిన దాడిపై డీజీపీ ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కాశ్మీర్, బీహార్‌లలో కూడా ఇలాంటి దుర్మార్గాలు జరగలేదని, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, రాజీలేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు రాష్ట్రాన్ని కాపాడుకుంటారో, శాశ్వతంగా తాకట్టు పెట్టుకుంటారో వారే స్పందించాలన్నారు. ప్రతి నిమిషం పిటిషన్లు వేసి ఎన్నికల్లో పోటీ చేయాలా, తమకు స్వేచ్ఛ లేదా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాదరణ ఉంటే ఎందుకు దాడులు చేస్తున్నారని నిలదీశారు.